భారతదేశం, అక్టోబర్ 27 -- బాలీవుడ్ హాట్ భామ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ ను ఉద్దేశించి కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ తో గొడవ తరచూ వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు మద్దతుగా చిత్రనిర్మాత అభినవ్ పై రాఖీ సావంత్ విరుచుకుపడింది.

ఎప్పుడైనా అభినవ్ ను కలుసుకుంటే గుడ్లతో కొడతానని రాఖీ సావంత్ పేర్కొంది. యూట్యూబ్ లో హిందీ రష్ తో పోడ్ కాస్ట్ లో సల్మాన్ గురించి రాఖీ మాట్లాడుతూ.. "అతడు ఈ భూమిపై దేవుడిలాంటివాడు. అతను నా కోసం చాలా చేశాడు. అతను నాకు బిగ్ బాస్ తో పని ఇచ్చినప్పుడు నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నాను. నా తల్లి క్యాన్సర్ చికిత్స కోసం అతను నాకు ఆర్థికంగా సహాయం చేశాడు'' అని రాఖీ చెప్పింద...