భారతదేశం, డిసెంబర్ 27 -- బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పుట్టినరోజు సందర్భంగా అతని ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెరీర్ మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సల్మాన్.. ఇప్పుడు రూ. 2900 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. అతనికున్న లగ్జరీ ఇళ్లు, ఫామ్‌హౌస్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

1988లో 'బీవీ హో తో ఐసీ' సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మొదలై.. 1989లో 'మైనే ప్యార్ కియా'తో స్టార్ హీరోగా ఎదిగిన సల్మాన్ ఖాన్ నేడు కోట్లకు అధిపతి. శనివారం (డిసెంబర్ 27) అతని పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ ఆస్తుల చిట్టా ఓసారి చూద్దాం.

తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 2900 కోట్లు. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న నటుల్లో సల్మాన్ ఒకరు. ఎన్నో లగ్జరీ ప్రాపర్టీలు అతని సొంతం.

1. గెలాక్సీ అపార్ట్‌మెంట్ (ముంబై): స...