భారతదేశం, నవంబర్ 5 -- తెలుగులో ముగ్గురు హీరోలు నటించిన మరో కామెడీ మూవీ మిత్ర మండలి. ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కాగా.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మూడు వారాల్లోనే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుంది.

మిత్ర మండలి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో బుధవారం (నవంబర్ 5) అనౌన్స్ చేసింది. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. గురువారం అంటే నవంబర్ 6 నుంచి మిత్ర మండలిని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు ఓటీటీలో మెరుగైన రెస్పాన్స్ కోసం చూస్తోంది.

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ ...