భారతదేశం, నవంబర్ 27 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఎన్నకల ప్రక్రియను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను కూడా ప్రారంభించింది.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈసీ Te-Poll Mobile యాప్ ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.

ఓటర్లు తమ ఓటరు స్లిప్ మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. యాప్ ఉపయోగించి ఫిర్యాదులను అప్ లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

' టీ-పోల్ మొబైల్ యాప్'ను ప...