భారతదేశం, డిసెంబర్ 21 -- రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించారు. కొత్త సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావటంతో. వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

సోమవారం(డిసెంబర్ 22) నుంచి కొత్త సర్పంచ్​ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. సర్పంచులతో పాటు వార్డు సభ్యులతో కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో ప్రత్యేకాధికారుల పాలన ముగిసినట్లు అవుతుంది. వీరి ప్రమాణస్వీకారాలకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పంచాయతీ కార్యదర్శులు. ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఈ తేదీనే (డిసెంబర్ 22) కొత్త పాలకవర్గాలతో మొదటి సమావేశం జరగనుంది. ప్రమాణపత్రంపై సంతకం చేసిన అనంతరం గెలిచినవాళ్లు బాధ్యతలను చేపడతారు. ...