భారతదేశం, మే 26 -- ఎందరో పేద విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. కానీ.. డబ్బులు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. అలాంటి వారికి సరోజిని దామోదర్‌ ఫౌండేషన్‌ దన్నుగా నిలుస్తోంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హులైన విద్యార్ధులు జూన్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడి కుటుంబంలో పుట్టిన వారు అర్హులు. ఈ విద్యార్ధులు ఇంటర్ విద్యను అభ్యసించేందుకు ఈ స్కాలర్‌షిప్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల తోపాటు.. కేరళ, కర్ణాటక, గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 10 వేల మంది విద్యార్థులకు సరోజిని దామోదర్‌ ఫౌండేషన్‌ ఉపకార వేతనాలు అందిస్తోంది.

కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ...