Hyderabad, ఏప్రిల్ 16 -- ఆహారం కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు. అది శరీరానికి పోషకాహారాన్ని, శక్తిని అందించేదిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం వల్ల శారీరక, మానసిక అభివృద్ధి జరుగుతుంది. కానీ, ఇదంతా సాధ్యం కావాలంటే, ఆహారాన్ని సరైన విధానంలో తీసుకుంటేనే జరుగుతుంది. ఆహార విధానం సరిగా లేకపోతే, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా శరీరానికి పూర్తి ప్రయోజనం దక్కదు. ఆధ్యాత్మిక గురువు సద్గురు ఆహారం తీసుకునే సరైన విధానం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఈ విధానాలను పాటించడం వల్ల శరీరం, మనసు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. అవేంటంటే,

సద్గురు చెప్పిన దాని ప్రకారం, నేలమీద కూర్చుని భోజనం చేయాలి. రెండు కాళ్ళు మడతపెట్టుకొని కూర్చుని తినాలి. సద్గురు ప్రకారం, కాళ్ళు చాచి కూర్చుని తినకూడదు. అలా చేస్తే ఆహారంలోని ప్రతికూల శక్తి మనకు చేరుతుం...