భారతదేశం, మే 12 -- భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి తిరిగి వస్తోన్న తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ నోడల్ ఆఫీస్ గా పనిచేస్తోంది.

సోమవారం మధ్యాహ్నం వరకు 162 మంది పౌరులు తెలంగాణ భవన్‌కి చేరుకోగా, వీరిలో జమ్మూ కశ్మీర్‌లోని వివిధ విద్యాసంస్థల నుంచి 56 మంది, పంజాబ్‌ రాష్ట్రం నుంచి 106 మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు.

ఇప్పటి వరకు 133 మంది తమ స్వగ్రామాలకు బయలుదేరగా, మిగిలిన వారికి తెలంగాణ భవన్‌లో తాత్కాలిక వసతి, భోజనం, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్... సోమవారం తెలంగాణ భవన్‌ అధికారులతో సమీక్ష జరిపి, అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. పరిస్థితి నెమ్మదిగా సాధారణమవుతుం...