భారతదేశం, మే 10 -- కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తెలుగు విద్యార్థులు లేఖ రాశారు. కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలని తరలించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తక్షణమే స్పందించారు. వర్సిటీ, కలెక్టర్‌తో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది విద్యార్థులను.. సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.

ఇటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. దీని ద్వారా సరిహద్దుల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 30 ఎమర్జెన్సీకాల్స్‌ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 8 మందిని సురక్షితంగా కాపాడినట్టు తెలంగాణ భవన్ అధికారులు వివరించారు. విద్యార్థులు అధైర్యపడొద్దని.. తాము అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. వసతి, రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు.

తాజా పరిస్థితులపై ...