భారతదేశం, నవంబర్ 4 -- భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో ఒకటైన 2025 Hyundai Venue ఎట్టకేలకు మన ముందుకు వచ్చింది. దీనితో పాటు, మరింత స్పోర్టీగా, పవర్‌ఫుల్‌గా ఉండే Venue N Line మోడల్‌ను కూడా హ్యుందాయ్ ఆవిష్కరించింది.

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర Rs.7.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ ధర డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిచయ ఆఫర్‌గా ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వచ్చే HX2, HX4, HX5 వేరియంట్‌ల ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. డీజిల్ మోడల్స్, అలాగే వెన్యూ N లైన్ ధరలను త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

కొత్త వెన్యూ, వెన్యూ N లైన్ కార్ల బుకింగ్‌లు ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు Rs.25,000 టోకెన్ మొత్తంతో డీలర్‌షిప్‌లలో లేదా ప్రత్యేక ఆన్‌లైన...