భారతదేశం, డిసెంబర్ 12 -- న్యూ జెన్​ 2026 కియా సెల్టోస్ పూర్తి స్థాయి మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ గ్లోబల్ స్టైల్ షీట్ ప్రకారం అప్డేట్​ చేసిన డిజైన్‌తో పాటు, ఇందులో ఫీచర్లు పెరిగాయి. అంతేకాదు భద్రత మెరుగుపడింది, క్యాబిన్ (ఇంటీరియర్) పూర్తిగా అప్​గ్రేడ్​ అయ్యింది. ఈ తాజా అప్‌డేట్‌లతో పాత తరం సెల్టోస్ కంటే ఈ కొత్త మోడల్ మరింత ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది. జనవరి 2న లాంచ్‌ (Launch) కానున్న ఈ 2026 కియా సెల్టోస్ మోడల్‌లో ఉన్న టాప్ 5 ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

1. ట్రాక్షన్ మోడ్స్-

నిజమైన ఆఫ్-రోడర్‌ కాకపోయినా, కొత్త ట్రాక్షన్ మోడ్స్ కారణంగా 2026 కియా సెల్టోస్ కష్టతరమైన భూభాగాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఈ మోడల్‌లో ముఖ్యంగా మూడు రకాల సెట్టింగ్‌లు ఉన్నాయి:

స్నో: మంచుతో కూడిన రోడ్లపై మె...