భారతదేశం, ఏప్రిల్ 1 -- కియా సెల్టోస్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన మోడల్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దాని అగ్రెసివ్​ డిజైన్ లాంగ్వేజ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెకెండ్​ జనరేషన్​ కియా సెల్టోస్​పై బిగ్​ అప్డేట్​! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ 2026 ద్వితీయార్ధంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాని సెగ్మెంట్​లోనే బలమైన పోటీదారుగా ఉన్న ఈ కాంపాక్ట్ ఎస్​యూవీ.. అనేక ఫీచర్ అప్​గ్రేడ్​లతో పాటు ప్రధాన డిజైన్ మార్పులతో రానుంది.

రెండొవ తరం సెల్టోస్ ఆశించిన డిజైన్ స్పై షాట్లు రాబోయే కాంపాక్ట్ ఎస్​యూవీ రేర్​ ప్రొఫైల్​ను ప్రదర్శించాయి. కియా ఈవీ5ను గుర్తుచేసే డిజైన్​తో, టెయిల్ లైట్లు ఆధునిక ఈవీ ఎలిమెంట్స్​ని సంప్రదాయ ఐసీఈ సౌందర్యంతో మిళితం చేస్తాయి. స్పై ఫోటో ప్రకారం, టెయిల్ లైట్లు పొడవుగా ఉంటాయి. బూట్​ న...