భారతదేశం, అక్టోబర్ 5 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన, బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన వెన్యూలో నెక్ట్స్​ జనరేషన్​ని భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. 2025 హ్యుందాయ్​ వెన్యూ నవంబర్ 4న మార్కెట్‌లోకి రానుంది.

దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటైన వెన్యూ సిరీస్‌కు ఇది ఒక పెద్ద అప్‌డేట్ కానుంది. అంతేకాకుండా, అప్డేటెడ్​ వెన్యూ ఎన్ లైన్ మోడల్ కూడా దీని తర్వాత త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది.

నివేదికల ప్రకారం.. కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ పూర్తిగా మారిన డిజైన్‌తో రానుంది. ఇది మరింత ఆకట్టుకునే, ఆధునిక రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఎస్‌యూవీలో రీ-డిజైన్డ్​ ముందు, వెనుక బంపర్‌లు, నిలువుగా అమర్చిన ప్రొజెక్టర్ యూనిట్లతో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్...