భారతదేశం, మే 14 -- సరస్వతీ నదీ పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు పుష్కరాలు జరగనుండగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోజుకో లక్ష మంది భక్తులు తరలి వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సరస్వతీ పుష్కరాలకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ రెడీ అయ్యింది. వరంగల్ రీజియన్ తో పాటు హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ బస్సులు, ఛార్జీలను ఖరారు చేశారు.

సరస్వతీ పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

ఇందులో హైదరాబాద్, మంచిర్యాల, కరీంనగర్ తో పాటు వరంగల్ రీజియన్ ...