Hyderabad, జూన్ 16 -- ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా సినిమాలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నాగ చైతన్య లవ్ స్టోరీ తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కుబేర. నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ కలిసి నటించిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నా 25 ఏళ్ల కెరీర్ ఏవీ చూడగానే ఇన్ని సినిమాలు చేశానా అనిపించింది. మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. మీడియాకి ధన్యవాదాలు" అని అన్నారు.

"ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా, ...