Hyderabad, జూన్ 25 -- కన్నడ క్రైమ్ డ్రామా మూవీ నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు. అంటే తెలుగులో మీ వస్తువులకు మీరే బాధ్యులు అని అర్థం. మనం ఎక్కడికి వెళ్లినా ఈ హెచ్చరికను చూస్తూనే ఉంటాం. ఇదే టైటిల్ తో వచ్చిన కన్నడ ఆంథాలజీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు (Nimma Vasthugalige Neeve Javaabdaararu). ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఈ శుక్రవారం (జూన్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జూన్ 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు - సూపర్ హిట్ సినిమా మీ సన్ నెక్ట్స్ లో జ...