భారతదేశం, జూలై 23 -- సయ్యారా మూవీ రివ్యూ దర్శకుడు: మోహిత్ సూరి

నటీనటులు: అహాన్ పాండే, అనీత్ పడ్డా

చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా 'సయ్యారా' (Saiyaara). కొత్త నటీనటులు నటించిన సినిమాకి ఇటీవల కాలంలో ఇంత ఆదరణ ఎప్పుడూ చూడలేదు. యంగ్ లవ్ ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మనల్ని మనం మరచిపోయి, మనకు నచ్చిన వారితో ఉండాలనే కోరిక మనల్ని కొన్నిసార్లు నిర్లక్ష్యంగా చేస్తుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు బాధ కలిగిస్తాయి. కానీ ఆ క్షణంలో మనం గెలిచినట్టుగా అనిపిస్తుంది. జులై 18న రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

కృష్ణ కపూర్ (అహాన్ పాండే) ఒక అహంకారి, కోపం ఎక్కువ ఉన్న సంగీతకారుడు. అతను ఒక పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తుంటాడు. వాణి (అనీత్ పడ్డా) అనే మొహమ...