భారతదేశం, మే 9 -- వేసవిలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ సమయంలో చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్ల మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది. ఈ ట్రైన్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం మార్గంలో రాకపోకలు సాగిస్తాయని.. అధికారులు వెల్లడించారు.

చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్‌ (07421) రైలు మే 13 నుంచి జూన్‌ 24 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఏడు సర్వీసులు ఉంటాయని అధికారులు వివరించారు. చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్‌ (07425) మే 12 నుంచి జూన్‌ 23 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఆరు సర్వీసులు ఉంటాయి.

శ్రీకాకుళం రోడ్‌- చర్లపల్లి (07422) రైలు మే 14 నుంచి జూన్‌ 25 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం ఏడు సర్వీసులు ఉంటాయి. శ్రీకాకుళం రోడ్‌- చర్...