భారతదేశం, ఏప్రిల్ 22 -- వేసవి కాలం వచ్చేసింది. రేపు (ఏప్రిల్ 23) పాఠశాలలకు చివరి రోజు. ఇక సమ్మర్ హాలీడేస్ లో పిల్లలకు స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ లకు పంపాలనుకునే పేరేంట్స్ చాలా మందే ఉంటారు. పిల్లలకు ఆటపై మరింత ఆసక్తి కలిగించేలా.. స్ఫూర్తి రగిలించే సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఈ అయిదు స్పెషల్. మరి ఈ మూవీస్ ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

పిల్లలకు చదువులే కాదు ఆటలూ ముఖ్యమనే గొప్ప సందేశాన్ని క్రికెట్ డ్రామాతో చాటిన మూవీ 'గోల్కొండ హైస్కూల్'. 2011లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో కోచ్ గా సుమంత్ అద్భుతంగా నటించారు. గ్రౌండ్ లో అకాడమీ కట్టాలనే మేనేజ్ మెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. స్కూల్ స్టూడెంట్స్ క్రికెట్లో ఎలా ఛాంపియన్ గా నిలిచారన్నదే ఈ థ్రిల్లర్ మూవీ కథ. అట్టడుగు ప్లేస్ నుంచి విజేతగా నిలిచిన ఆ టీమ్ స్టోరీ కచ్చితంగా...