Hyderabad, ఏప్రిల్ 19 -- మందపాటి జీన్స్, బాడీకి అతుక్కుపోయే దుస్తులు, లెదర్ స్కర్టులు వేసవిలో ఆహ్లాదకరంగా ఉండవు. వాతావరణాన్ని బట్టి మీరు డ్రెస్సులను ఎంపిక చేసుకోవాలి. సౌకర్యంగా అలాగే ష్యాషన్ గా ఉండే దుస్తుల కోసమే యువత ఇప్పుడు ఆసక్తి చూపిస్తుంది. మండే ఎండల నుండి మిమ్మల్ని రక్షించి, చర్మానికి శ్వాస తీసుకునే అవకాశాన్ని ఇచ్చే డ్రెస్సులను ఎంపిక చేసుకుంటే మంచిది.

అయితే అలాంటి దుస్తుల్లో స్టైలిష్ గా కనిపిస్తారా అనేది ప్రశ్న. నిజానికి ఇప్పుడు ష్యాషన్ ఇండస్ట్రీ ఎంతో విస్తరించింది. కాలానికి, రుతువులకు తగ్గట్టు అనేక రకాల డ్రెస్సులు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి వేసవిలో మీకు సౌకర్యవంతంగా ఉంటూ స్టైలిష్ గా కనిపించే చేసే డ్రెస్సులను ఎంపిక చేసుకోండి. కొన్ని సింపుల్ మార్పులు, కొన్ని రకాల దుస్తులను వార్డ్ రోబ్ లో చేర్చుకోవడం ద్వారా వేడి నుంచి ఉపశమనం పొంద...