Hyderabad, ఏప్రిల్ 15 -- టేస్ట్‌తో పాటు హెల్తీ కూరగాయల్లో ఒకటి బెండకాయ. సమ్మర్లో సహజంగా కలిగే డీహైడ్రేషన్‌ను తగ్గించి శరీరానికి చలువదనాన్ని సమకూరుస్తుంది. అందుకే బెండకాయను సమ్మర్లో వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. దీని కోసం మీరు ఇప్పటికే కూరగానో, పులుసుగానో, ఫ్రైగానో తిని ఉంటారు. కానీ, "బెండకాయ రోల్స్"గా ఎప్పుడైనా ట్రై చేశారా.. అయితే ఇప్పుడే ట్రై చేసేయండి. ఇదిగోండి ఈ సింపుల్ రెసిపీతో రుచికరమైన స్నాక్స్ ను తయారుచేసుకోండి.

1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది: బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెల్లగా నడిపిస్తుంది. గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.

2. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది: బెండకాయలో నీరు 90% ఉంటుంది. వేసవి కాలంలో తేమను నిలుపుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది.

3. రక్తంలో చక్కెర నియంత్రణ: ...