భారతదేశం, అక్టోబర్ 7 -- దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆవిష్కరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా చాలా విషయాలు వెలుగులోకి తీసుకురావొచ్చని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తెలుగు, హిందీ, మరాఠీతో సహా లోకల్ ట్రైబల్ భాషపై పరిశోధన చేయవచ్చన్నారు. సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో వినూత్నగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. లోగోలో ట్రైబల్ భాషలు పొందుపరచడాన్ని అభినందించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణలో గిరిజనుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఉండాలనే కల నిజమైందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇప్పటికే యునివర్సిటీ కోసం కేంద్రం రూ.800 కోట్లకుపైగా నిధులు కేటాయించిందని తెలిపారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస...