భారతదేశం, జూలై 14 -- దేశంలో పెరుగుతున్న ఊబకాయం (obesity) సమస్యను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమోసాలు, జిలేబీలు వంటి డీప్-ఫ్రైడ్ స్నాక్స్‌లో కొవ్వు, చక్కెర స్థాయిని తెలిపేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య సంస్థలను ఆదేశించింది.

నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్ (AIIMS) సహా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ఆరోగ్య సంస్థలకు ఒక ఆదేశం జారీ అయినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది. క్యాంటీన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆకర్షణీయమైన "నూనె, చక్కెర బోర్డులు" (Oil and Sugar Boards) ఏర్పాటు చేయాలని ఈ ఆదేశంలో పేర్కొన్నారు. ఈ సమాచార పోస్టర్లు సాధారణ ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో ఉండే కొవ్వు, చక్కెర స్థాయిలను స్పష్టంగా తెలియజేస్తాయి. ఇది సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరికల మాదిరిగానే ప్రజలను హెచ్చరిస్తుంది.

అధి...