భారతదేశం, సెప్టెంబర్ 6 -- బాలీవుడ్ నటి సమీరా రెడ్డి సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువగానే ఉంటున్నారు. తన కుటుంబ విషయాలు, ఫిట్‌నెస్ చిట్కాలు, బ్యూటీ టిప్స్‌తో పాటు రకరకాల రెసిపీలను కూడా ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఈసారి ఆమె ఒక అద్భుతమైన చాక్లెట్ ట్రఫుల్స్ రెసిపీని పంచుకున్నారు. అయితే, ఇవి మామూలు ట్రఫుల్స్ కాదు.. ఆరోగ్యకరమైన శనగలతో తయారు చేసేవి.

శనగలతో స్వీటు చేయడమా? వినడానికే కాస్త వింతగా అనిపించినా, ఇవి చాలా రుచిగా ఉంటాయని సమీరా తెలిపారు. "శనగలతో చాక్లెట్ ట్రఫుల్స్. నా పిల్లలు కూడా ఆగకుండా తినేశారు. శనగలతో డెజర్ట్ అంటే వింతగా ఉంటుంది. కానీ రుచి మాత్రం ఊహించలేనంత అద్భుతంగా ఉంటుంది" అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

అంతే, నోరూరించే శనగల చాక్లెట్ ట్రఫుల్స్ రెడీ.

ఈ రెసిపీలో కేవలం ఆరోగ్యకరమైన పదార...