భారతదేశం, జనవరి 16 -- ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఆ సినిమానే 'గుర్రం పాపిరెడ్డి'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ నటించిన ఈ సినిమా శుక్రవారం (జనవరి 16) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాధుల్లోని శవాలను మార్చే గ్యాంగ్ చేసే సందడితో ఈ మూవీ ఎంటర్ టైన్ చేస్తోంది.

డిఫరెంట్ టైటిల్ తో ఆడియన్స్ కు కనెక్ట్ అయిన సినిమా గుర్రం పాపిరెడ్డి. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పెద్దగా ఆడలేకపోయిన మూవీ ఇది. ఇప్పుడిది డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ తెలుగు సినిమా.

థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే గుర్రం పాపిరెడ్డి ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్ 19, 2025న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులో నరేశ్ అగస్త్య హీరో. ఫరి...