Hyderabad, అక్టోబర్ 2 -- సాయి దుర్గ తేజ్ అకా సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమాల్లో రిపబ్లిక్ మూవీకి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ మూవీ నిజమైన సమాజాన్ని, ప్రజల పోకడను ప్రతిబింబిస్తుంది. కుళ్లిపోయిన సమాజాన్ని బాగుపరచాలనే కోరుకున్న ఓ ఐఏఎస్ అధికారికి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.

నాలుగు సంవత్సరాల క్రితం 'రిపబ్లిక్' మూవీ వచ్చి అందరిలోనూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన రిపబ్లిక్ మూవీని రాజకీయాలు, అవినీతి, సమాజంలోని అసమానతల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగ చిత్రం.

నటుడిగా సాయి దుర్గ తేజ్ స్థానాన్ని సుస్థిరం చేసిన చిత్రంగా 'రిపబ్లిక్' నిలుస్తుంది. వ్యవస్థాగతంగా కుళ్లిపోయిన సమాజంలో విధి నిర్వహణలో ఉన్న ఐఏఎస్ అధికారిగా సాయి దుర్గ తేజ్ అసమానమైన నటనను కనబర...