Hyderabad, ఆగస్టు 31 -- బాహుబలి కట్టప్ప సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్ కలిసి నటించిన లేటెస్ట్ మైథలాజికల్ సోషల్ డ్రామా చిత్రం త్రిబాణధారి బార్బరక్. డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది.

థియేటర్లలో రిలీజ్ అయిన త్రిబాణధారి బార్బరిక్‌కు రెస్పాన్స్ పర్వాలేదు. అయితే, ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో త్రిబాణధారి బార్బరిక్ కథా నేపథ్యం, తదితర ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నాడు నటుడు వశిష్ట ఎన్ సింహా.

-మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఇదొక ట్రెండ్‌లా మారింది. ఇప్పుడు మేం 'బార్బరిక్' పాత్రతో వచ్చాం. ఇలాంటి మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇంకా వస్తే చాలా మంచిది. వీరందరి గురించి మన ముందు తరాలు తెలుసుకోవాలి. అయితే మా...