భారతదేశం, జూలై 13 -- దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు మరణం షాక్ కు గురి చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు చాలా మంది సెలబ్రిటీలు తరలి వచ్చారు. ఇందులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా ఉన్నారు. అయితే దివంగత నటుని ఇంటి వెలుపల జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారింది. ఓ అభిమానిని రాజమౌళి తోసేశారు.

కోట శ్రీనివాస రావు పార్థివ దేహాన్ని సందర్శించిన తర్వాత రాజమౌళి ఇంటి బయటకు వచ్చారు. ముందు ఆయన భార్య రమా రాజమౌళి వచ్చారు. ఆ తర్వాత రాజమౌళి బయటకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అభిమానులు ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి అయితే రాజమౌళికి అడ్డుగా వచ్చాడు. ఆయనతో పాటే నడుస్తూ వచ్చాడు. దీంతో రాజమౌళికి కోపమొచ్చింది. సమయం, సందర్భం లేదా అంటూ ఆ అభిమానిని తోసేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విషాద సమయంలో ఇలా చే...