భారతదేశం, మే 12 -- టీవీ సీరియళ్ల కాన్సెప్ట్‌తో హారర్ కామెడీ మూవీగా 'శుభం' క్యూరియాసిటీ కలిగించింది. ఈ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారటంతో మరింత క్రేజ్ వచ్చింది. త్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై ఈ మూవీని ఆమె ప్రొడ్యూజ్ చేశారు. హైప్‍తో గత శుక్రవారం మే 9న రిలీజైన ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరు చూపింది. శుభం చిత్రం ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లనే రాబట్టింది.

శుభం సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ విషయాన్ని త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. "శుభంపై ప్రేమ బలపడుతూనే ఉంది" అని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మూవీ రూ.5.25 కోట్ల గ్రాస్ దక్కించుకుందని పోస్టర్ తీసుకొచ్చింది.

ఈ లెక్కలను బట్టి చూస్తే ఫస్ట్...