భారతదేశం, డిసెంబర్ 3 -- నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వార్తతో అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. ఇప్పుడు రాజ్ సోదరి షీతల్, సమంతాను నిడిమోరు కుటుంబంలోకి స్వాగతిస్తూ ఒక ప్రత్యేక సందేశాన్ని రాశారు. కొత్తగా పెళ్లైన జంటతో కూడిన మొదటి కుటుంబ చిత్రాన్ని కూడా ఆమె పంచుకున్నారు.

రాజ్ సోదరి షీతల్ నిడిమూరు, సమంతను నిడిమోరు కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఒక హృదయపూర్వక సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నూతన వధూవరులైన సమంత, రాజ్ లతో కూడిన మొదటి కుటుంబ చిత్రాన్ని కూడా ఆమె పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో సమంత నిడిమోరు కుటుంబంలో భాగమైన రోజు తనకు ఆధ్యాత్మికంగా ఎంతగానో, లోతుగా అర్థవంతంగా అనిపించిందని షీతల్ తెలిపారు.

"ఈరోజు చంద్రకుండంలో శివుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు.. ప్రదోష సమయంలో, ...