భారతదేశం, డిసెంబర్ 2 -- దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో అందరి దృష్టి పెళ్లిపైనే కాకుండా, ఆమె మాజీ భర్త నాగ చైతన్య తాజా సోషల్ మీడియా కదలికలపై కూడా పడింది. నాగ చైతన్య దాదాపు అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన 'దూత' సిరీస్ గురించి ఒక పోస్ట్ పంచుకున్నాడు. ఈ టైమింగ్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ లో ఉన్న లింగ భైరవి ఆలయంలో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. అదే రోజు నాగ చైతన్య పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో చై తన 'దూత' సిరీస్ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక స్టిల్ పంచుకున్నారు.

సీరియస్ లుక్ లో ఉన్న తన చిత్రాన్ని పంచుకుంటూ.. "దూత అనేది సృజనాత్మకత, నిజాయితీ ఆధారంగా ఒక నటుడిగా మీ...