భారతదేశం, డిసెంబర్ 2 -- నటి సమంత రూత్ ప్రభు, సినీ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమూరు డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహంతో ఒక్కటయ్యారు. సమంత రెండో పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఆమె వివాహ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ పెళ్లి ఎలా జరిగింది? పెళ్లికి వచ్చిన అతిథులకు ఇచ్చిన గిఫ్ట్ లు ఏంటీ? అనే విషయాన్ని సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి పంచుకుంది.

సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తూ మరిన్ని వివరాలను అందించింది. శిల్పా పంచుకున్న ఓ చిత్రంలో సమంత తన వివాహ దుస్తులలో రాజ్ పక్కన కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. వాళ్లు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈ జోడీ స్పెషల్ గా నిలిచింది.

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వచ్చిన...