భారతదేశం, డిసెంబర్ 1 -- కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో సోమవారం రోజున ప్రముఖ సినీ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరుల వివాహం జరిగింది. 38 ఏళ్ల సమంత.. ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుని, తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ వేడుకలో సమంత అద్భుతమైన ఎర్రటి చీరను ధరించి, దానికి తగ్గట్టుగా సంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరించుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ వేడుకలో సాధారణంగా ఉండే సంప్రదాయ రింగులకు భిన్నంగా, చాలా ప్రత్యేకమైన డిజైన్‌తో ఉన్న సమంత నిశ్చితార్థపు ఉంగరం అందరినీ ఆశ్చర్యపరిచింది.

సమంత ధరించిన ఈ వివాహ ఉంగరం సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇందులో ఆకర్షణీయమైన జ్యామితీయ డిజైన్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. బహుళ, స్పష్టమైన, కోణీయ ముఖాలు (Facets) ఉన్న వజ్రం లేదా క్రిస్టల్‌తో తయారైన ఈ ఉంగరం.. ఒక ధైర్యమైన, కళాత...