భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రోడ్యూసర్ గా తొలి అడుగునే విభిన్నంగా వేస్తోంది సమంత. డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'శుభం' మూవీని ప్రోడ్యూస్ చేసింది. కంటెంట్ ను నమ్మి ఈ సినిమాను తీసిన సామ్ విజయంపై కాన్ఫిడెంట్ తో ఉంది. ఈ ఫ్యామిలీ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ పై అప్ డేట్ వచ్చింది.

సమంత నిర్మించిన 'శుభం' మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ5 గ్రూప్ దక్కించుకుంది. అంటేఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు జీ5 వేదికగా నిలవనుంది. అలాగే టీవీ విషయానికి వస్తే జీ తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంది. అయితే ముందుగా థియేటర్లలో మే9న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత మినిమం నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ప్రోడ్యూసర్ గా సమంత జర్నీకి మంచి ఆరంభమే దక్కే ఛాన్స్ కనిపి...