భారతదేశం, డిసెంబర్ 1 -- అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ దూసుకెళ్తూనే ఉంది. సమంత భర్త రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గత వారం అంటే నవంబర్ 24 నుంచి 30 మధ్య 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఆర్మాక్స్ మీడియా ప్రతి వారం ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టును రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నవంబర్ 24 నుంచి 30తో ముగిసిన వారానికి సంబంధించి కూడా ఈ లిస్టు తీసుకొచ్చింది. ఇందులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తొలి స్థానంలో నిలిచింది.

దీనికి గత వారం 7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. నాలుగేళ్లుగా ఈ కొత్త సీజన్ కోసం ఎదురు చూసిన అభిమానులు.. నవంబర్ 21న స్ట్రీమింగ్ ప్రా...