భారతదేశం, ఏప్రిల్ 28 -- స్టార్ హీరోయిన్ సమంత 38వ పడిలోకి అడుగుపెట్టారు. నేడు (ఏప్రిల్ 28) తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 2010లో ఏం మాయ చేశావే సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన సమంత టాప్ హీరోయిన్ రేంజ్‍కు ఎదిగారు. తెలుగు, తమిళంలో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పటివరకు 45 సినిమాలకుపైగా చేశారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. సమంత తన కెరీర్లో కొన్ని చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ప్రేక్షకులకు ఆ పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోయేంత మెప్పించారు. వావ్ అనిపించారు. సమంత సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన ఓ 6 సినిమాలు, అవి ఏ ఓటీటీల్లో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

రామ్‍చరణ్ హీరోగా నటించిన రంగస్థలం (2018) చిత్రంలో హీరోయిన్‍గా చేశారు సమంత. ఆ చిత్రంలో రామలక్ష్మి పాత్రలో జీవించేశారు. పల్లెటూరి అమ్మాయిగా గడుసుతనం, అమాయక...