భారతదేశం, అక్టోబర్ 28 -- టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు.. ఫిట్‌నెస్ విషయంలో తన నిబద్ధత, అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెక్కుచెదరని శరీరాకృతి, తీవ్రమైన వర్కౌట్‌ల పట్ల ఆమెకున్న ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. తరచుగా తన జిమ్ సెషన్స్ తాలూకు స్నిప్పెట్‌లను సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన అభిమానులకు నిలకడగా ఉండేందుకు ప్రేరణనిచ్చారు.

తాజాగా అక్టోబర్ 27న సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, కండలు తిరిగిన తన వీపు భాగం, శిల్పం చెక్కినట్లున్న బైసెప్స్‌ను ప్రదర్శించారు. బలం, సుకుమారత్వం కలగలిసిన ఆ పోజ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్‌కు ఆమె "బిల్డ్, బిల్డ్, బిల్డ్" అని క్యాప్షన్ ఇచ్చారు.

నటి సమంత, మే 31న పంచుకున్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో.. బలం పెంచే శిక్షణ (స్ట్రెంగ్త్ ట్రైనింగ్), రెసిస్టెన్స్ వర్కౌట్‌లు, కోర్ వ్య...