భారతదేశం, డిసెంబర్ 1 -- అఫీషియల్.. సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఈ సింపుల్ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమెనే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సోమవారం (డిసెంబర్ 1) తమిళనాడు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె పెళ్లాడింది.

సమంత రెండో పెళ్లి చేసుకుందన్న వార్తల నేపథ్యంలో దానిని కన్ఫమ్ చేస్తూ ఆమెనే ఆ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇవాళ్టి డేట్ డిసెంబర్ 1, 2025ను క్యాప్షన్ గా ఉంచుతూ ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం. ఈ ఫొటోలు వెంటనే వైరల్ గా మారాయి. పాయల్ రాజ్‌పుత్, రుహానీ శర్మ, అనుపమ పరమేశ్వరన్ తోపాటు ఎంతో మంది అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ ఫొటోల్లో రాజ్, సమంత ఎంతో ఆనందంగా కనిపించారు. ఓ ఫొటోలో గుడిలో ప్రత్యేక పూజలు, మరో ఫొటోలో రింగులు మార్చుకోవడం, ఇంకో ఫొటోలో ఇద్దరూ కలిసి ఆనందంగా గుడి నుంచి బయ...