భారతదేశం, డిసెంబర్ 1 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో సోమవారం (డిసెంబర్ 1) ఉదయం వీరి వివాహం అత్యంత పవిత్రంగా జరిగింది. అయితే వీళ్లు చేసుకున్న భూత శుద్ధి వివాహం ఏంటి? అసలు ఏం చేస్తారన్న వివరాలు ఇక్కడ చూడండి.

సమంత, రాజ్ నిడిమోరు తమ రిలేషన్షిప్ ను ఏకంగా పెళ్లితోనే కన్ఫమ్ చేసేశారు. అంతేకాదు వీళ్లు భూత శుద్ధి పెళ్లితో ఒక్కటయ్యారు. పంచభూతాల సాక్షిగా.. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. ప్రాచీన యోగ సంప్రదాయంలో విశేషమైన 'భూతశుద్ధి వివాహ' క్రతువు ద్వారా వీరిద్దరూ ఒక్కటయ్యారు.

సాధారణ పెళ్లి తంతులా కాకుండా.. ఇది ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకు అతీతంగా ద...