Hyderabad, జూలై 9 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ఇప్పుడు సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సమంత తన ఇటీవలి యూఎస్ పర్యటన నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో సిరీస్‌లో రాజ్ ఒకటి కంటే ఎక్కువసార్లు కనిపించడంతో ఈ పుకార్లు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు అసలు ఈ రాజ్ నిడిమోరు ఓ తెలుగు వాడే అన్న విషయం తెలుసా? అతడి గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

రాజ్ నిడిమోరు ఒక ఇండియన్-అమెరికన్ ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్, నిర్మాత. అతడు విభిన్న జానర్‌లను కలపడంలో, పదునైన, క్యారెక్టర్-ఆధారిత కథలను రూపొందించడంలో పేరు సంపాదించాడు. అతడు కృష్ణ డి.కె.తో కలిసి రాజ్ అండ్ డీకే దర్శక ద్వయంగా ప్రేక్షకులకు బాగా పరిచయం. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జి', 'షోర్ ఇన్ ది సిటీ', ఈమధ్యే సమంత నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి హిట్ ...