భారతదేశం, జనవరి 11 -- అక్కినేని కోడలిగా ఒకప్పుడు అందరి మన్ననలు పొందిన స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె వ్యక్తిగత జీవితం ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి తాజాగా ఆమె ఆడపడుచు (రాజ్ నిడిమోరు సోదరి) శీతల్ నిడిమోరు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టే నిదర్శనం.

సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మా ఇంటి బంగారం'. శుక్రవారం (జనవరి 9) విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో శీతల్.. సినిమా సెట్స్‌లో షూట్ చేసిన కొన్ని అన్ సీన్ వీడియోలను షేర్ చేస్తూ తన వదినపై ప్రేమను చాటుకుంది.

శీతల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. "మా ఇంటి బంగారం ట్రైలర్ అద్భుతం. ఇంట్లో లలిత.. మధుర భాషిణి.. మృదు స్వభావి. బయట మాత్రం మహిష...