Hyderabad, మే 6 -- సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి మూవీ శుభం. ఈ సినిమా వచ్చే శుక్రవారం (మే 9) రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. నిర్మాతగా తన తొలి శుక్రవారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తనకు గుడి కట్టి ఆరాధించడంపైనా ఇదే ఇంటర్వ్యూలో సామ్ స్పందించింది.

సమంత నిర్మాతగా నిర్మించిన తొలి మూవీ శుభం ఈ శుక్రవారం (మే 9) రిలీజ్ కానుండటంపై ఆమె మాట్లాడింది. "నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్‌గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది.

గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగి...