భారతదేశం, డిసెంబర్ 3 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో 'యోగ' పద్ధతిలో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సమంత బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ కూడా హాజరైంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన క్రేషా.. సమంతకు రాజ్ ఎందుకు సరైన జోడి అనేది అందంగా వివరించింది.

డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు హాజరైన డిజైనర్ క్రేషా బజాజ్.. రాజ్ సమంతకు ఎందుకు సరైనోడో వివరిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సమంత మనసుకు సరిగ్గా సరిపోయే వ్యక్తి రాజ్ అని ఆమె పేర్కొంది.

పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ క్రేషా బజాజ్ ఇలా రాసుకొచ్చింది. "చిన్న చిన్న ఆనందాలే నన్ను ముందుకు నడిపిస్తాయి. క...