భారతదేశం, డిసెంబర్ 4 -- నటి సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో 'యోగ' పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ వివాహం తర్వాత రాజ్ మాజీ భార్య శ్యామలి డే (Shhyamali De) సోషల్ మీడియా వేదికగా మౌనం వీడింది. తనకు లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, తనకు ఎవరి సానుభూతి అవసరం లేదని ఘాటుగా స్పందించింది.

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత అతని మొదటి భార్య శ్యామలి తొలిసారి దీనిపై స్పందించింది. ఇప్పుడు కూడా వాళ్ల పేర్లు ప్రస్తావించకుండానే ఓ పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో శ్యామలి ఒక నోట్ రాసింది. అందులో ఆమె చాలా ఘాటు కామెంట్స్ చేసింది.

"ఇక్కడ ఎవరైనా డ్రామా లేదా బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తుంటే, మీకు అది ఇక్కడ దొరకదు. దయచేసి వెళ్లిపోండి. నేను ఎవరి సాన...