భారతదేశం, జూలై 9 -- నటి సమంత రూత్ ప్రభు కొంతకాలంగా చిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. సమంత, రాజ్ నిడిమోరు వాళ్ల రిలేషన్ షిప్ ను ఇలా ఓపెన్ గా బయటపెట్టారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సమంత అమెరికా టూర్ కు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త చిత్రాలను షేర్ చేసింది. డెట్రాయిట్, మిచిగాన్‌ లో దిగిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అక్కడ ఆమె తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2025 ఎడిషన్‌ వేడుకలకు హాజరైంది. అయితే, నిజమైన హైలైట్ ఆమె రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలే. ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు, సమంత ఒకరిపై ఒకరు చేయి వేసుకుని, ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ ...