భారతదేశం, జనవరి 2 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. మూసీ ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేని స్పష్టం చేశారు. ఫస్ట్‌ ఫేజ్‌లో గండిపేట నుంచి గాంధీ సరోవర్‌ వరకు 21 కి.మీ. అభివృద్ధి చేస్తామన్నారు.

వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్‌ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ADB బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుందని. కేంద్రం కూడా అనుమతి ఇచ్చింద్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు చెబుతామని వివరించారు.

యూపీలో గంగా ప్రక్షాళన చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మూసీని కలుషితం చేయడంతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలించాల్సి ఉ...