Hyderabad, సెప్టెంబర్ 29 -- అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మించిన బహుభాషా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 'త్రిముఖ' (Trimukha). ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం త్రిముఖ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ తుది దశలోకి అడుగుపెట్టింది.

అయితే, త్రిముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. సృజనాత్మక అంచనాలను మించి త్రిముఖ సినిమా వచ్చిందని మేకర్స్ తెలిపారు.

నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, "దర్శకుడు రజేశ్ నాయుడు గారి దార్శనిక దర్శకత్వంలో మా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో 'త్రిముఖ' అత్యుత్తమ చిత్రంగా రూపుదిద్దుకుంది. మా టీమ్ సహకారంతో సినిమా మా తొలి ఆలోచనను కూడా మించిపోయింది. ఈ నాణ్యమైన దృశ్య కావ్యాన్ని ప...