భారతదేశం, నవంబర్ 10 -- పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 200 స్పెషల్ బస్సులు నడపనున్నట్టుగా సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులను పెంచుతారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు కూడా ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. పుట్టపర్తికి వచ్చే భక్తులకు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు బస్సు సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసుల గురించి సమాచారం కోసం అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి బస్టాండుల్లో కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నా...