Hyderabad, ఆగస్టు 14 -- స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం 'త్రిబాణధారి బార్బరిక్'. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

పాన్ ఇండియన్ యాక్టర్, బాహుబలి కట్టప్ప సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ సినిమాలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, యాంకర్ ఉదయ భాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన త్రిబాణధారి బార్బరిక్ పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇక త్రిబాణధారి బార్బరిక్ సినిమాను ఆగస్ట్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌ను బుధవారం (ఆగస్ట్ 13) రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 3 నిమిషాల రన్ టైమ్ ఉన్న త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్...