భారతదేశం, సెప్టెంబర్ 17 -- ఓటీటీలోకి ఇవాళ ఓ తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీ దూసుకొచ్చింది. ఈ రోజు (సెప్టెంబర్ 17) రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది 'కన్యా కుమారి' మూవీ. ఈ తెలుగు ఫీల్ గుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది? ఈ సినిమా కథ ఏమిటో చూసేద్దాం.

తెలుగు యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీగా థియేటర్లలో రిలీజైన 'కన్యా కుమారి' మూవీ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 17 నుంచి ఆహా వీడియోతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో ఈ మూవీ ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. మంచి ఫీల్ గుడ్ టచ్ తో ఉన్న తెలుగు రొమాంటిక్ మూవీ చూడాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్.

కన్యా కుమారి మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా...